TRENDING NOW

స్లోవేకియా మొదటి మహిళా అధ్యక్షురాలు

స్లోవేకియా మొదటి మహిళా అధ్యక్షురాలు

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 02,

స్లొవేకియా చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న జుజనా కపుతోవా(45) ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా విజయం సాధించారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

నిజానికి, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కపుతోవా.. రాజకీయ ఉద్దండుడు, అధికార పార్టీ అభ్యర్థి మారోస్ సెఫ్‌కోవిక్‌పై విజయం సాధించారు. ఇది మంచి-చెడుకు మధ్య జరుగుతున్న యుద్దం అంటూ కపుతోవా ఎన్నికల్లో బరిలో నిలవగా.. ఆమెకు 58% ఓట్లు, సెఫ్‌కోవిక్‌కు 42% ఓట్లు దక్కాయి.ఎన్నికల్లో విజయం అనంతరం మాట్లాడిన కపుతోవా.. కేవలం ఎన్నికల్లో గెలిచినందుకు తాను సంతోషించడం లేదన్నారు. ఈ విజయం నిజాన్ని నిర్భయంగా వెల్లడించడానికి.. మానవత్వం వైపు నిలబడటానికి దోహదపడబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

వృత్తిపరంగా న్యాయవాది అయిన కపుతోవా ఓ భూ ఆక్రమణ కేసులో 14 సంవత్సరాలు న్యాయం కోసం వాదించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, స్వలింగ సంపర్క వివాహలే నేరమైన దేశంలో LGBTQ+ హక్కుల కోసం ఆమె పోరాడారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు పొంది వేరుగా ఉంటున్నారు.

మామాట: మహిళల్లో ఈ స్ఫూర్తి రావలసి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: