అంతర్జాతీయ క్రికెట్‌కు యువీ వీడ్కోలు…

Share Icons:

ఢిల్లీ, 10 జూన్:

ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాలని అందించిన టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్‌పై కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు యువీ ఈరోజు తెరదించాడు.

సోమవారం ముంబైలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యువీ 2000 సంవత్సరంలో వన్డే కెరీర్ ఆరంభించాడు. 2003లో యవరాజ్ సింగ్ టెస్ట్ కెరీర్ మొదలైంది.

మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు చేశాడు. 52 హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 1177 పరుగులు నమోదు చేశాడు. టీ20ల్లో 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

132 ఐపీఎల్ మ్యాచుల్లో 2750 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో యువరాజ్‌ ఆడనున్నట్టు తెలుస్తోంది.

1996లో అండర్-15 వరల్డ్ కప్, 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్, 2007లో టీ-20 వరల్డ్ కప్, 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా చరిత్ర సృష్టించాడు.

Leave a Reply