వైసీపీ కార్యకర్తలపై కేసు పెట్టిన రోజా…

ap government gave apiic chairperson to roja
Share Icons:

అమరావతి: సొంత పార్టీ కార్యకర్తలపై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏ‌పి‌ఐ‌ఐ‌సి ఛైర్మన్ రోజా కేసు పెట్టారు.  ఆదివారం నగిరి పర్యటనలో రోజాపై వైసిపి కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.  దీంతో రోజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వారిపై కేసు నమోదైంది. అసలు ఏం జరిగిందంటే.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం లో పర్యటించిన రోజాకు కె బిఆర్ పురంలో వైసిపి కార్యకర్తల నుండి చేదు అనుభవం ఎదురైంది.

రోజాపై దాడికి యత్నించారు వైసిపి కార్యకర్తలు. కె బిఆర్ పురం గ్రామ సచివాలయం భూమి పూజకి వెళ్ళిన సమయంలో గ్రామంలోకి ప్రవేశించకుండా ఓ వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు . పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే తమ పార్టీకి చెందిన నేతలు కొందరు దాడి చేయించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా ఈ విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్తానని పేర్కొన్నారు

అలాగే తనపై దాడికి ప్రయత్నించిన వారిని ఉపేక్షించబోమని చెప్పిన రోజా వారిపై కేసులు నమోదు చేశారు. రోజా ఫిర్యాదుతో పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తి,హరీష్, సంపత్ తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు.

కాగా, ఇటీవల కర్నూలులోని జూపాడు మండలం బన్నూరులోని ఓ కార్యక్రమానికి హాజరైన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను వైసిపి కార్యకర్తలు తమకు సమాచారం ఇవ్వకుండా వచ్చారని నిలదీయగా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, కార్యకర్తల కాళ్ళు పట్టుకుని ప్రాధేయ పడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే తరహాలో ఇప్పుడు రోజాకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురైంది.

 

Leave a Reply