అక్కడ వైసీపీ విజయం సులువే…!

Share Icons:

అమరావతి, 18 మే:

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అయితే కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలకి జనసేన గట్టి పోటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువ ఉంది. ఇక తూర్పులో కాకినాడ రూరల్‌లో వైసీపీ వర్సెస్ జనసేనగా ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని పోలింగ్ సరళి చెబుతుంది.

ఇక ఇక్కడ వైసీపీ నుంచి గట్టి లీడర్ కురసాల కన్నబాబు పోటీ చేశారు. టీడీపీ నుంచి సిట్టింగ్ పిల్లి అనంతలక్ష్మి పోటీ చేయగా, జనసేన నుంచి పంతం నానాజీ బరిలో ఉన్నారు. అయితే 2009 ఎన్నిక‌ల్లో ట్రయాంగిల్ ఫైట్లో ప్రజారాజ్యం నుంచే గెలిచిన క‌న్నబాబు గ‌త ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 40 వేల ఓట్లు తెచ్చుకుని సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. క‌న్నబాబుకు ఇక్కడ వ్యక్తిగ‌త ఓటు బ్యాంకు కూడా ఉంది. దీనికి తోడు ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు కూడా తోడ‌య్యింది. దీంతో ఆయన విజయం ఏకపక్షమే అని తెలుస్తోంది.

కాకపోతే కన్నబాబుకి జనసేన నుంచి గట్టి పోటీ ఎదురైంది. పంతం నానాజీ ఇక్కడ నుంచి జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేశారు. రెండు పార్టీలకి తగ్గకుండా నానాజీ డ‌బ్బు ఖ‌ర్చు చేశారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన పిల్లి అనంత‌ల‌క్ష్మి విజ‌యం సాధించారు. అయితే, ఈసారి ఆమెపై తీవ్ర వ్యతిరేక‌త వ్యక్త‌మైంది. పాల‌నా విష‌యాల్లో ఎమ్మెల్యే జోక్యం క‌న్నా ముందు ఆమె భ‌ర్త జోక్యమే ఎక్కువ‌గా ఉంద‌ని ప్రచారం జ‌రిగింది.

మామాట: ఫలితాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందా

Leave a Reply