TRENDING NOW

ఆ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టకుండా వైసీపీ ఆపుతుందా…

ఆ ఎమ్మెల్యే హ్యాట్రిక్ కొట్టకుండా వైసీపీ ఆపుతుందా…

గుంటూరు, 16 మార్చి:

ఎన్నికలు వచ్చేశాయి. రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టేశాయి. ఇక నేతలు కూడా నియోజకవర్గాల్లో ఇంటిఇంటికి తిరుగుతూ ప్రజల మెప్పునీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఈ క్రమంలోనే 2009, 2014 ఎన్నికల్లో 20 వేల పైనే మెజారిటీతో గెలిచిన వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు..మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక వైసీపీ కూడా జీవీకి చెక్ పెట్టి హ్యాట్రిక్ కొట్టకుండా ఆపాలని ప్రయత్నిస్తుంది.  

టీడీపీ నుండి జీవే మళ్ళీ చేస్తుండగా..వైసీపీ నుండి బొల్లా బ్రహ్మనాయుడు బరిలోకి దిగుతున్నారు. ఇక జీవీ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ…వాటిని సాధ్యమైనంతవరకు పరిష్కరిస్తారు. సంక్షేమ పథకాలు కూడా బాగానే ప్రజలకి చేరువయ్యేలా చేశారు. అయితే అమరావతిలో రైతుల దగ్గర భూముల కొన్న విషయంలో జీవీపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే వినుకొండలో టీడీపీ క్యాడర్ రెండు గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేయడం జీవీకి మైనస్ అవుతుందని అనుకుంటున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య తాగు నీరు. ఇక్కడ ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో ఈ నీటిని తాగిన వారు రోగాల బారిన పడుతున్నారు.

ఇక అటు ఆర్ధికంగా బలంగా ఉన్న బ్రహ్మ నాయుడే…జీవీని ఢీకొనగలరు అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక్కడ వైసీపీ క్యాడర్ కూడా గట్టిగా ఉండటంతో… ఈసారి గెలుపు సులువని భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేపై వ్యతిరేకిత ఉన్న ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లలేదనే వాదన ఉంది. కానీ ఈసారి జగన్‌కి పెరిగిన ప్రజాబలం తనకి కలిసొస్తుందని బొల్లా ఉన్నారు.  

ఏ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం జనాభా, ఓటర్లు అధికమొత్తంలో ఉన్నారు. వారే గెలుపోటములని ప్రభావితం చేస్తారు. మరి జీవీ మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొడతారో లేక వైసీపీ జీవీకి చెక్ పెడుతుందో చూడాలి.

మామాట: ఈ సారి జీవీ గెలుపు అంత ఈజీ కాదులే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: