ఆ టీడీపీ సిట్టింగ్ ఈ సారి వైసీపీ ఖాతాలోకే…

Share Icons:

తిరుపతి, 15 మే:

చిత్తూరు జిల్లా…చిత్తూరు నియోజకవర్గం గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి…తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి డీకే స‌త్య‌ప్ర‌భ వైసీపీ అభ్య‌ర్థి జంగాల‌ప‌ల్లి శ్రీనివాసులుపై 6,799 మెజారిటీతో విజ‌యం సాధించారు.

ఈసారి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఏఎస్ మ‌నోహ‌ర్ కు కేటాయించింది. స‌త్య‌ప్రభ‌ను రాజంపేట ఎంపీగా పోటీ చేయించారు. ఇక వైసీపీ నుంచి జంగాలపల్లే పోటీ చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి జంగాల‌ప‌ల్లి శ్రీనివాసులుపై రెండుసార్లు స్వ‌ల్ప మెజారిటీతో ఓడిపోయ‌న సానుభూతి ఉంది.

ప్ర‌ధానంగా తెలుగుదేశం పార్టీపై ఉన్న వ్య‌తిరేక‌త‌, ఆ పార్టీలో విభేదాలు వైసీపీకి ఎక్కువ‌గా క‌లిసి వ‌చ్చాయి.

కాకపోతే ఎన్నిక‌ల వేళ నియోజకవర్గంపై పట్టున్న సీకే బాబు తెలుగుదేశం పార్టీలో చేర‌డం వైసీపీకి పెద్ద దెబ్బ‌గా భావించ‌వ‌చ్చు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 70 వేల వ‌ర‌కు ఉన్న బీసీల ఓట్ల‌పై టీడీపీ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకుంది. అ తర్వాత క‌మ్మ‌, రెడ్డి సామాజ‌క‌వ‌ర్గ ఓట్లు స‌మంగా ఉన్నాయి.

ఈ రెండు వ‌ర్గాలు రెండు పార్టీల‌కు ఎక్కువ‌గా మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఎస్సీలు, ముస్లింల‌లో వైసీపీ ప‌ట్ల ఆధ‌ర‌ణ క‌నిపించింది. మొత్తంగా పోలింగ్ స‌ర‌ళి త‌ర్వాత వైసీపీలో గెలుపుపై ధీమా పెరిగింది. ఈసారి టీడీపీ సిట్టింగ్ సీటు వైసీపీకి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మామాట: చూడాలి మరి ఫలితాల్లో ఏం జరుగుతుందో

Leave a Reply