మళ్ళీ ఆ ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోకే..

Share Icons:

అమరావతి, 18 మే:

కడప జిల్లా రాజంపేట పార్ల‌మెంటు..వైసీపీ కి కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ సారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి సీనియర్ నాయకురాలు డికె సత్యప్రభ పోటీకి దిగారు.

ఈ పార్లమెంట్ ప‌రిధిలో ఉన్న క‌డ‌ప జిల్లాలోని రాజంపేట‌, రైల్వే కోడూరు, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ బ‌లంగా ఉంది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో రాజంపేట‌లో టీడీపీ గెలిచినా ఈసారి వైసీపీకి అక్క‌డ మొగ్గు క‌నిపిస్తోంది.

ఇక‌, చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు, పీలేరు, మ‌ద‌న‌ప‌ల్లె, తంబ‌ళ్ల‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాలు రాజంపేట లోక్ స‌భ ప‌రిధిలో ఉన్నాయి. వీటిల్లో పుంగ‌నూరు నుంచి మిథున్ రెడ్డి తండ్రి రామ‌చంద్రారెడ్డి బ‌రిలో ఉన్నారు. ఇక్క‌డ మిథున్ కు ఎక్కువ మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. మిగ‌తా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరాహోరీ పోరు ఉంది. మొత్తంగా రాజంపేట‌, రాయ‌చోటి, రైల్వేకోడూరు, పుంగ‌నూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి మెజారిటీ వ‌స్తే మిగ‌తా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరాహోరీ పోరు జ‌రిగినా వైసీపీకి విజయావ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

మామాట: కంచుకోట కాబట్టి విజయం సులువే

Leave a Reply