వైసీపీ సంచలన నిర్ణయం: వారికి నో టికెట్…

Share Icons:

అమరావతి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపొద్దని అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పోటీలో నిలిపితే ఆ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వకూడదని రీజినల్‌ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకున్నవారికి నిరాశ మిగిలింది.

కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల గడువు ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 660 జెడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గురువారం నామినేషన్ల పరిశీలన.. ఈనెల 14న తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను మార్చి 24న ప్రకటించనున్నారు. ఇటు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు వేయొచ్చు. మార్చి 23న ఎన్నికల పోలింగ్‌ .. 27న ఫలితాలను ప్రకటిస్తారు.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు హడావిడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని గొడవలు జరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఇక్కడ కూడా వైసీపీ నేతలే దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో తమపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. దాడికి సంబంధించి ఓ వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి తలకు బలమైన గాయమై రక్తం కారుతుండటం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జీవీఎల్ చెప్పారు. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని రాజకీయపరమైన హింసాత్మక వాతావరణాన్ని అదుపులోకి తీసుకురావాలని సూచించారు.

మరోవైపు మాచర్లలో తమ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై దాడి ఘటనలని ఏపీ మాజీ సీమ్ చంద్రబాబు నాయుడు ఖండించారు. దీనిపై డీజీపీ గౌతం నవాంగ్‌ను ప్రశ్నించారు. దీనికే ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా ఇలా జరగడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రక్తపు మరకలు చూసినా డీజీపీకి బాధ కలగట్లేదా అని నిలదీశారు. రాష్ట్రంలో ఇంతటి హింసాత్మక,భయానక పరిస్థితులు ఎప్పుడూ లేవని, పులివెందుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆఖరికి కశ్మీర్,బీహార్‌లో కూడా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. నియంత పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.

 

Leave a Reply