పెడనలో ఫ్యాన్ హవా ఉందా..!

Share Icons:

విజయవాడ, 19 మార్చి:

ఈ సారి పెడనలో హాట్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావు…ఆరోగ్య కారణాల రీత్యా తన కుమారుడు వెంకట కృష్ణప్రసాద్‌కి టికెట్ ఇప్పించుకున్నారు. అటు వైసీపీ నుండి సీనియర్ నేత జోగి రమేశ్ బరిలో ఉండగా…జనసేన నుండి అంకెం శ్రీనివాస్ పోటీ లో ఉన్నారు.

కాగా, ఇక్కడ టీడీపీ క్యాడర్ కూడా గట్టిగానే ఉంది. పెడనలో అభివృద్ధి బాగానే జరిగింది గాని అనుకున్నంత మాత్రం జరగలేదు. అయితే కాగిత ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన అంత యాక్టివ్‌గా పనులు చేయలేదని టాక్ ఉంది. అటు తండ్రి స్థానంలో దిగుతున్న ప్రసాద్‌కి అనుకున్నంత పేరు ఏమి లేదు. కేవలం తండ్రి పేరు చెప్పుకునే ఓట్లు అడగాల్సి ఉంది. మరోవైపు వైసీపీ నుండి బరిలోకి దిగుతున్న జోగి రమేశ్ 2009లో కాంగ్రెస్ నుండి గెలిచారు. దీంతో జోగికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా వైసీపీకి కూడా బలం పెరగడంతో జోగికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం జోగికే పెడన ఓటర్లు మద్ధతు తెలిపేలా కనిపిస్తున్నారు.

అటు ఇక్కడ జనసేన తరుపున శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ పవన్ అభిమానులు ఎక్కువ. కానీ పార్టీ అంత స్ట్రాంగ్‌గా లేదు. ఇక ఈ మూడు పార్టీలు నుండి పోటీ చేసే నేతలు గౌడ సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. పైగా పెడన నియోజకవర్గంలో కాపు, గౌడ కులాలు కీలక పాత్ర పోషిస్తాయి.  లక్ష యాభై వేల ఓట్లల్లో సుమారు 45 వేల ఓట్లు కాపు, 35 వేలు గౌడ కులంకు చెందిన వారున్నారు. మరి పెడనలో ఫ్యాన్ ఊపు ఎక్కువ ఉన్న…దానికి సైకిల్, టీ గ్లాసు ఏ మేర చెక్ పెడతాయో చూడాలి.

మామాట: మొత్తానికి త్రిముఖ పోరు జరిగేలా ఉంది…

Leave a Reply