సీనియర్ నేతపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ…

Share Icons:

విజయవాడ, 3 జనవరి:             

గతంలో దివంగ‌త వంగవీటి రంగా, ఆయ‌న త‌న‌యుడు రాధాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన్ని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ వివాదం సద్దుమణగడంతో ఆయనపై సస్పెన్షన్‌ని ఎత్తివేసింది.

ఇక ఆ తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గౌతమ్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ చానల్‌లో ముస్లిం మహిళల మనోభావాలను కించ పర్చే విధంగా గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది.

పార్టీ అధినేత జగన్‌ ఆదేశాల మేరకు ఈ అంశంపై విచారణ జరిపిన క్రమశిక్షణ సంఘం గౌతమ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని వైసీపీ క్రమశిక్షణ సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆయన నుంచి సంజాయిషీ అందగానే సస్పెన్షన్‌ వేటు వేసేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమవుతోంది.

మామాట: ఈ సారి శాశ్వత సస్పెన్షన్ ఖాయం అనుకుంటా…

Leave a Reply