జనసేన ఎమ్మెల్యే టార్గెట్‌గా వైసీపీ సరికొత్త వ్యూహం?

janasena leaders fires on jagan government
Share Icons:

అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు చేసే విషయంలో జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్ అసెంబ్లీలో చెప్పిన విధంగా రాష్ట్రానికి మూడు రాజధానుల ఉండొచ్చని చెప్పిన దానిపై జి‌ఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు క్లారిటీ ఇచ్చేశాయి. ఇక హై పవర్ కమిటీ కూడా ఇదే అంశాన్ని చెప్పనుంది. హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికని కేబినెట్ ఆమోదించి, అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయనుంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి ఎలాగో బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది కాబట్టి మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం.

కానీ ఇక్కడ టీడీపీ అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తుంది కాబట్టి దానిపైనే ఉండే అవకాశముంది. అటు పవన్ దీనిపై ఆచి తూచి అడుగులేస్తున్నారు. రాజధాని ఎక్కడ ఉన్న ఒకే చోట ఉండాలంటున్నారు. అలాగే అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే జనసేనాని ఇలా ఉంటే ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మాత్రం జగన్ నిర్ణయం స్వాగతిస్తున్నారు. ఆయన ఈ మధ్య ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న సమర్ధిస్తున్నారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. దీంతో జనసేన ఎమ్మెల్యే రాపాకని ఉపయోగించుకుని వైసీపీ ప్రభుత్వం సరికొత్త వ్యూహం అమలు చేయనుంది.

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ఆమోదించటం ద్వారా తమ ఆలోచనలను అమలు చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో సభలో వైసీపీ తో పాటుగా టీడీపీ..జనసేన మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసినా.. సభలో జనసేన నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు వ్యక్తం చేస్తున్న అభిప్రాయమే సభలోనూ వ్యక్తం చేయటం ద్వారా..అది జనసేన వాయిస్ గా సభా రికార్డుల్లో నిలుస్తుంది. దీని ద్వారా తమ ఆలోచనలను జనసేన మద్దతు ఇచ్చిందని చెప్పుకొనే వెసులుబాటు ప్రభుత్వానికి ఏర్పడుతుంది. దీని ద్వారా పవన్ ను ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తోంది. మరి.. పవన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మూడు రాజధానులపై ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Leave a Reply