చంద్రబాబు,రాహుల్‌పై సెటైర్లు వేసిన విజయసాయి…

YSRCP MP vijayasai reddy sensational comments against chandrababu
Share Icons:

హైదరాబాద్, 3 డిసెంబర్:

ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో రైతన్నలు అల్లాడిపోతుంటే.. వీరిని పట్టించుకునే తీరికలేని యూటర్న్ బాబు(చంద్రబాబు), ఏపీలో దొచుకున్న డబ్బును తెలంగాణలో పంచే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు.

ఇక పార్క్ హయత్ లో బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా చంద్రబాబు చీటింగ్ కళకు రాహుల్ గాంధీ అబ్బురపడిపోయి తెలంగాణ ఎన్నికల మేనేజ్ మెంట్ మొత్తాన్ని ఆయన చేతికి అప్పగించారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు హైదరాబాద్ లో మకాం వేసి ఏపీలో దోచుకున్న నిధులతో నంద్యాల మోడల్ ను ప్రయోగించే పనిలో పడ్డారని విమర్శించారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు ఆదిగురువైన చంద్రబాబుకు అబద్ధాలు చెప్పడంలో ఉన్న స్కిల్స్ చూసి రాహుల్‌కు దిమ్మతిరిగి పోయిందని సెటైర్ వేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా ఓట్లను హోల్ సేల్ గా కొని ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయొచ్చో నాయుడు బాబు రాహుల్ బాబాకు ఉపదేశించారని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

మామాట: రోజుకో సెటైర్ వేసి జనాల్ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నారుగా…

Leave a Reply