మళ్ళీ ట్విట్టర్ లో వచ్చేశారు: విమర్శలు చేసేసుకున్నారు…

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రోజు ఈ ఇద్దరు నేతలు ట్విట్టర్లో విమర్శలు చేసుకొనేదే ఉండలేరు అనుకుంటా. రోజుకు సమయానికి భోజనం చేస్తారో లేదో గానీ విమర్శలు మాత్రం చేసుకుంటారు. ఇక ఈరోజు కూడా ఇద్దరు నేతలు విమర్శలు చేసుకున్నారు. మొదట సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ తమపై దారుణంగా ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మీ బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచిపెట్టినా మీ అరాచకాలన్నింటినీ సోషల్ మీడియా బయటపెట్టిందనేనా ఈ ఏడుపు! అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ పైనా, జగన్ గారి పైనా నీచపు రాతలు రాసేందుకు వేలమందిని నియమించి 24/7 కాల్ సెంటర్లను నిర్వహించింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబుగారూ! అంటూ విజయసాయి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు పోస్టులు పెట్టుకుంటారని, మీకు నచ్చకపోతే ఎఫ్ బీ కి ఫిర్యాదు చేయొచ్చని హితవు పలికారు. చంద్ర’జ్యోతి’ ఎంత చిచ్చు పెట్టాలని చూసినా లాభం లేకుండా పోయిందన్నదే సారు అసలు బాధ అంటూ ఎద్దేవా చేశారు. అయినా మీ పుత్రరత్నం పెట్టిన ట్వీట్లేమైనా సుమతీ శతకాల్లా అనిపిస్తున్నాయా? అని విజయసాయిరెడ్డి నిలదీశారు.

“సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లే ఫస్టుంటాయి. ఆ లిస్టులో కిరసనాయిలు తప్పనిసరిగా ఉంటాడు. వీళ్లు జన్మలో మారరు. వీళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛకు నిర్వచనాలు వేరే ఉంటాయి” అంటూ మండిపడ్డారు.

ఇక విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్లకు వెంటనే బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చేశారు. ‘సోషల్ మీడియాని భ్రష్ఠు పట్టించిన ఘన చరిత్ర మీది శకుని మామా! పేటీఎంలో డబ్బులు వేసి పోస్టులు పెట్టించుకొని లైకులు కొట్టించుకునే దౌర్భాగ్యం నీది, మీ తుగ్లక్  వైఎస్ జగన్ ది. మీ వైఎస్సార్సీపీ అబద్ధపు బతుకులు టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్ల ద్వారా బయటపడుతున్నాయని వణుకు వస్తోందా?’ అబద్ధాలు, కుట్రపూరిత వార్తలు తప్ప ఒక్క నిజాన్ని కూడా నీ పేపర్లో  ప్రచురించని నీకు అసలు వేరే పత్రికలు గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంది శకుని మామా ? అక్కడికేదో దేశంలో ఉన్న పత్రికలన్నింటికీ నువ్వే సలహాదారు అయినట్లు చెప్తున్నావ్ !’ అని విమర్శించారు.

 

Leave a Reply