దేవుడా..హద్దులు దాటిన టీడీపీ-వైసీపీ నేతల విమర్శలు….

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రోజు ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈయనకు అదే ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గట్టి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నేడు విజయసాయి రెడ్డి రాష్ట్రంలో తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు పెంచిపోషించిన ఇసుక మాఫియా కలుగులోంచి బయటపడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు మాత్రం కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత అయివుండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారని విమర్శించారు.

ఇక ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ తండ్రీకొడుకులు గొలుసులు విప్పి వదిలేశారని, అవి దారినపోయే వాళ్ల వెంటపడుతున్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆయన ఉస్కో అంటే మొరగటమొక్కటే వాటికి తెలుసని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజ తప్పదని మర్చిపోయినట్టున్నారంటూ చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ ముగించారు.

అయితే ఈ వ్యాఖ్యలు బుద్దా వెంకన్న గురించే చేసినవని అర్ధమైపోతుంది. దీంతో బుద్దా కూడా విజయసాయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెంపుడుకుక్కలన్నింటినీ తండ్రీకొడుకులు గొలుసులు విప్పి వదిలేశారని విజయసాయి చేసిన వ్యాఖ్యల పట్ల బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. “అయినా పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన? దొంగలెక్కలు రాసేవాడికి కార్యకర్తలు, నాయకుల విలువ ఎలా తెలుస్తుంది? పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చేవారిని కుక్కలతో పోల్చి సంబరపడిపోతున్నావు, నీలాంటి అవినీతి పందులకు త్వరలోనే జైలు పూజ చేయిస్తాం. త్వరలోనే నీకు చిప్పకూడు ఖాయం” అంటూ తీవ్ర ఆవేశంతో బుద్ధా ట్వీట్ చేశారు.

“నెత్తిన తాటికాయ పడిన గుంటనక్కలాగా విజయసాయి రెడ్డి 420 తాతయ్య ట్విట్టర్‌లో ఓ మూలుగుతా ఉంటారు. అయ్యా! పత్తిత్తు కబుర్లు అంటారు. మిమ్మల్ని చూసినా, మీ మాటలు విన్నా పత్తిత్తే గుర్తుకువస్తోంది. రాజకీయ హింసలో పిహెచ్‌డి చేసినోళ్ళ వైపు నిలబడి నీతులు మాట్లాడితే ఎలా? చంద్రబాబుగారు రాజకీయ హింస మొదలుపెట్టి ఉంటే ఈరోజు ఈ పిచ్చి కూతలు కూయడానికి మీరుండేవారు కాదేమో! ముందు మీ మూతులకు, చేతులకు అంటిన రక్తాన్ని తుడుచుకోండి’’ అంటూ బుద్దా భారీ డైలాగులు వేశారు. మరి రానున్న రోజుల్లో వీరి మాటలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

Leave a Reply