చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా

Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్ధేశించి ట్విటర్‌ వేదికగా ఎంపీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

కాగా మరో ట్వీట్‌లో.. ‘వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేక పోతున్నారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడు. పిఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట. కట్టప్పను మించి పోయాడు’ అంటూ పవన్‌ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అటు సమదృష్టి లేని పాలకులను ఎన్నుకున్న పాపం ప్రజలదే అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ట్వీట్టర్‌లో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులని, ఆ పాలకులను అతి జాగూరుకతతో ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని, ఆ బాధ్యత నిర్వహణలో ప్రజలకు ఏమరపాటు తగదని పేర్కొన్నారు. అప్రమత్తంగా లేకపోతే ఎంచుకున్న ప్రజలే బాధితులవుతారని తెలిపారు. ‘తప్పు చిన్నది-మూల్యం పెద్దది, వర్తమానం గుర్తించండి’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

 

Leave a Reply