ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టింది..

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.  అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్‌ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా అంటూ మండిపడ్డారు. ఇక ‘ఎకనమిక్‌ టైమ్స్‌ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడని పరోక్షంగా ఓ మీడియా సంస్థని ఉద్దేశించి అన్నారు. ఇక అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్‌ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ సర్వైవల్‌ సీక్రెట్‌ ఇదే కదా!’ అంటూ ట్వీట్‌ చేశారు.

అదే విధంగా ‘ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్‌ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో మీడియా ఏడుపు మొదలెట్టిందని,  కొత్త టారిఫ్‌తో కోటీ 43 లక్షల మంది వినియోగదారులకు 60 కోట్ల వరకు భారం తగ్గుతుందన్న వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెర తీసింది’ అని మరో ట్వీట్‌ చేశారు.

అటు ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముతో తెలంగాణలో భూములు కొనుగోలు చేశారని, ఆ భూములకు రైతుబంధు పథకం ద్వారా రూ.67 లక్షలు తీసుకున్నాడని చెవిరెడ్డి వివరించారు. దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్‌ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీగా ఉండి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలు మరికొన్ని త్వరలోనే బయట పెడతానన్నారు.

అవినీతి తిమింగలం అయిన ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ జంట హత్యల కేసులో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశాడన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు దేశం విడిచిపెట్టి పోయే ప్రమాదం ఉందని.. కేంద్రం వెంటనే లుకౌట్‌ నోటీసులు విడుదల చేయాలని కోరారు.  దేశ భద్రత దృష్ట్యా మాట్లాడుతున్నానని, అతనిపై తనకు వ్యక్తిగత కక్షలేమీ లేవని చెవిరెడ్డి వివరించారు.

 

Leave a Reply