సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బులిస్తున్న బాబు…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: శాసన మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ తమ ఎమ్మెల్సీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఒక్కో ఎమ్మెల్సీకి రూ.5 కోట్లు ఆఫర్ చేశారని విమర్శించింది. తమ ఎమ్మెల్సీలను లాగేసుకొని… రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకుండా చేయాలని వైఎస్సార్సీపీ ప్రయత్నించిందని ఆరోపించింది.

ఇక దీనికి కౌంటర్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడన్న విజయసాయి.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బులు ముట్టజెబుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారోనని బాబు నిద్రపోవడం లేదని ఎద్దేవా చేశారు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీతభత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అటు ఎమ్మెల్సీలు చేజారకుండా చంద్రబాబు జాగ్రత్త వహించారు. నిరంతరం ఎమ్మెల్సీలతో టచ్‌లో ఉండాల్సిన బాధ్యతను యనమల, అచ్చెన్నాయుడికి చంద్రబాబు అప్పగించారు. సోమవారం అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉండాలని కూడా టీడీపీ నిర్ణయించింది.

ఇక ఈరోజు శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ…. శాసనమండలి రద్దుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి అంటే పెద్దల సభ అని, కానీ బాబు…ఇంట్లో ఉన్న దద్దోజనాన్ని మండలిలో పెట్టారని సెటైర్ వేశారు. మండలి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, కాబట్టి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని రోజా కోరారు.

టీడీపీ ఎమ్మెల్సీలని కొనుగోలు చేయాలసిన అవసరం జగన్ మోహన్ రెడ్డికి లేదని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ కోసం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని పారిపోయి వచ్చారని, అలాగే తమ 23 మంది ఎమ్మెల్యేలని అడ్డగోలుగా సంతలో పశువులు మాదిరిగా కొన్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఏపీ కేబినెట్ సమావేశంలో మండలి రద్దు దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్‌ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

 

Leave a Reply