ఫ్లాప్ సినిమాలో హీరో-విలన్ రెండు పాత్రలు చేస్తున్న పవన్ నాయుడు….

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.  పవన్ కల్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ఉందని ఆయన అన్నారు. నిజ జీవితంలో ఆయన పోషిస్తోన్న పాత్ర ఫ్లాప్ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు’ అని విజయసాయి రెడ్డి చురకలంటించారు.

వైసీపీలో చేరిన బీద…

టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాలో కీలకనేతగా ఉన్న బీద మస్తాన్ రావు తాజాగా వైసీపీలో చేరారు. నిన్ననే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే అయిన బీద మస్తాన్ రావు ఎన్నికల తర్వాత టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా పాల్గొనడంలేదు. దాంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పంపారు.

ఇటీవలే సీఎం జగన్ హాజరైన ఆక్వా రైతుల సదస్సులో బీద మస్తాన్ రావు కూడా కనిపించడం పార్టీ మారతారన్న ప్రచారానికి ఊతమిచ్చింది. గత ఎన్నికల్లో మస్తాన్ రావు నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తన సోదరుడు రవిచంద్రని కూడా వైసీపీలోకి తీసుకోచేందుకు ప్రయత్నిస్తానని మస్తాన్ రావు చెప్పారు.

 

Leave a Reply