బాబు…లోకేశ్ ఎమ్మెల్సీ సీటు కిడారికి ఎందుకు ఇవ్వలేదు?

ap cm chandrababu remembered his alipiri bomb blast
Share Icons:

అమరావతి, 9 మే:

మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పదవీకాలం ముగియడంతో పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఈరోజు సీఎంఓ కార్యాలయంలో తన రాజీనామాను అందజేస్తానని మంత్రి శ్రావణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ మేరకు విజయవాడ చేరుకున్న మంత్రి కిడారి శ్రావణ్ కుమార్…సీఎంవో అధికారులతో రాజీనామాపై చర్చించారు.

ఇక శ్రావణ్ మంత్రి పదవి పొందిన ఆరు నెలల్లో చట్ట సభల్లో సభ్యుడు కాకపోవడంతో గవర్నర్ సూచన మేరకు ఆయన రాజీనామా చేయనున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తండ్రి చనిపోయాక నవంబర్ 11న శ్రావణ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా నేరుగా మంత్రి అయినవారు ఆరు నెలల్లో చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో వెంటనే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. శ్రావణ్ పదవీకాలానికి గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుంది.

ఇదిలా ఉంటే కిడారి కుటుంబాన్ని ఆదుకుంటానన్న చంద్రబాబు మరి లోకేష్ ఎమ్మెల్సీ సీటును కిడారికి ఎందుకు ఇవ్వలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటానన్న చంద్రబాబువి నక్కజిత్తుల రాజకీయాలంటూ మండిపడ్డారు. మరో వందేళ్ల పాటు నక్క జిత్తుల రాజకీయాలకు పేటెంటు మీదేనంటూ విమర్శలు గుప్పించారు.

ఆరునెలల గడువు ముగిసింది. తండ్రిల ఆ కుటంబానికి ఆదుకుంటానన్న వాడివి మరి లోకేష్ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్‌కు ఎందుకివ్వలేకపోయావ్ ? అంటూ చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

మామాట: మంచి ప్రశ్నే అడిగారు…

Leave a Reply