చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోయారు…

tdp mla's not attend the chandrababu fasting....who will hand to tdp
Share Icons:

హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారిపోయారంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో దోపిడీ, అరాచకాలకు అంతేలేదన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మండించారని…అందుకే ప్రజలు చంద్రబాబును తరిమికొట్టారని పేర్కొన్నారు. అమరావతి చుట్టూ 4 గ్రామాల్లో మొసలి కన్నీరు కారుస్తూ చంద్రబాబు పగటి వేషగాడిలా మారిపోరని దుయ్యబట్టారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు.

అటు నేడు రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ అని విమర్శించారు. న్యూయార్క్ అవతల బోస్టన్ నగరంలో ఉన్న సంస్థ బోస్టన్ సంస్థ అని… అమెరికాలో ఉన్న బోస్టన్ సంస్థకు అసలు అమరావతి మీద అవగాహన ఉంటుందా అని ప్రశ్నించారు. అమరావతిలో ఏమేమీ ఉన్నాయో, ప్రజలు.. వారి విధానాల గురించి ఏదైన అవగాహన ఉందా అని నిలదీశారు. జీఎన్ రావు ఇచ్చిన రిపోర్ట్‌నే బోస్టన్ కమిటీ ఇస్తుందని వారు అన్నారు. హైపర్ కమిటీ కూడా ఓ బోగస్ కమిటీ అని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే అమరావతిలోని వెలగపూడి, మల్కాపురం గ్రామాల రైతులకు నోటీసులిచ్చిన వ్యవహారం కలకలం రేపుతోంది. పలువురు రైతులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. 307 హత్యాయత్నం కేసుతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈరోజు సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆధార్ కార్డుతో రావాలని 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి. ఈ నోటీసులపై రైతులు స్పందిస్తూ.. ఉద్యమం అణిచివేతకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

 

Leave a Reply