బడ్జెట్ 2020: ఏపీకి హ్యాండ్ ఇచ్చిన కేంద్రం…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశామని అయితే బడ్జెట్‌లో హోదా ప్రస్తావనే లేదన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందని, వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఏపీకి బడ్జెట్‌ నిరుపయోగమని, పోలవరాన్ని ఆలస్యం చేయొద్దు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనడంలో స్పష్టత లేదు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత ధోరణి చూపించకూడదు’ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

అటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. వివిధ విభాగాలకు పద్దుల కేటాయింపు గందరగోళంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం తాము అదీ చేస్తాం, ఇదీ చేస్తామని మాటలు చెబుతుంది కానీ.. ఆచరణలో మాత్రం చేయదని మరోసారి స్పష్టమైందన్నారు. బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ దాదాపు 2.36 గంటల పాటు ప్రసంగించారు. కానీ అన్నీ చెప్పిన అంశాలనే చెప్పారని పేర్కొన్నారు.

బడ్జెట్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశం ఏ సమస్యలను ఎదుర్కొంటుంది, నిరుద్యోగిత, మందగమనంపై మాట్లాడలేదు. జీడీపీని 10 శాతం పెంచుతామని చెప్పి ఆశలు కల్పించారని విమర్శించారు.

ఈక ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రిక్తహస్తం చూపిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీఎం జగన్ తుగ్లక్ చర్యల వల్లే కేంద్రబడ్జెట్‌లో ఏపీకి నిధులు శూన్యమన్నారు. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ది పనులన్నీ ఆపేశారు. పోలవరం సహా, ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారు. రాజధానికి నిధులు వద్దని ప్రధానికి ఇచ్చిన తొలి వినతిలో జగన్ చెప్పారు. పీపీఏలను రద్దు చేయడం సీఎం మొదటి తిక్కపని. 5దేశాల ఎంబసీలు హెచ్చరించాయి.. కేంద్రం చెప్పింది, కోర్టులు ఆదేశించాయి. అయినా మూర్ఖత్వం వీడలేదు. దీనితో ఏపీకి వచ్చే పెట్టుబడులన్నీ వెనక్కి పోయాయి. సింగపూర్, కియా ఆగ్జిలరీ యూనిట్లు, డేటా సెంటర్, రిలయన్స్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అన్నీ వెళ్లిపోయాయని అన్నారు.

 

Leave a Reply