25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

విశాఖపట్నం: సీఎం జగన్ జన్మదినం పురస్కరించుకుని విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ నేతలు పుట్టినరోజు వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఐదు నెలల్లో సీఎం జగన్ చేశారని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం  చారిత్రక నిర్ణయమని విజయసాయి రెడ్డి అన్నారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఐదు నెలల్లో సీఎం జగన్ చేశారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు కావడంతో అమరావతిలో ఆయనను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అమరావతిలో రైతులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.

జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తన 47వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటు పార్టీ శ్రేణులు కూడా తమ అభిమాన నాయకుడి బర్త్‌డే సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖులంతా సోషల్ మీడియా వేదిక జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తమ అభిమాన నాయకుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా జగన్ బర్త్‌డే సందర్భంగా మూడు నాలుగు ట్వీట్లు చేశారు. ‘ఆంధ్రరాష్ట్ర ముద్దుబిడ్డ 5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు అయిన మా వైఎస్ జగన్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు..’ అంటూ జగన్‌తో కలిసి దిగిన అనేక ఫోటోల్ని ఆమె వీడియోద్వారా పోస్టు చేశారు. ’ హీ కేమ్, హీ సా… హీ కాంకర్డ్ అంటూ ఇంగ్లీష్ టెక్ట్స్ తో కూడిన మరో ట్వీట్‌ను కూడా రోజా ట్వీట్ చేశారు.

 

Leave a Reply