బాబు, లోకేశ్ లకు అదిరిపోయే పంచ్ వేసిన విజయసాయి….

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: ఏపీలో జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా కూడా జగన్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ఓ విరుచుకుపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి పంచ్ ఇచ్చాడు.

మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారని… పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలని టీడీపీ భావిస్తోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదనే భావన టీడీపీ నేతల్లో ఉందని అన్నారు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. మీ మనవడు దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం ? అంటూ చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.

పనిలో పనిగా నారా లోకేశ్‌పై కూడా విమర్శలు గుప్పించారు. స్కూళ్ళలో చైనీస్, జపనీస్ భాషలను కూడా నేర్పించాలని వకాల్తా పుచ్చుకున్న విషయం లోకేశ్‌కు తెలిసి ఉండదని పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరైనా పాత వీడియోలు చూపించి కాబోయే పార్టీ అధ్యక్షుడికి జ్ణానం ప్రసాదించండి అంటూ కామెంట్ చేశారు. నాలుక మడత పెట్టడంలో తండ్రికి మించి పోయాడని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో దీక్షకు సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతించాలని నగర పోలీస్, మున్సిపల్ కమిషనర్లను టీడీపీ కోరింది. అయితే, ఆయన దీక్షకు అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇక్కడ అనుమతి ఇవ్వలేవని వారు తెలిపారు. దీంతో, ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్ ను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని వారు తెలిపారు.

 

Leave a Reply