బాబు కొంప మునగకూడదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు…

Share Icons:

అమరావతి:

 

రోజు ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు వర్షం కురిపిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి రెచిపోయారు. ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదతో దిగువన ఉన్న ఎవరి ఇల్లు అయినా మునిగితే ఫర్వాలేదని, తన ఇల్లు మాత్రం మునగటానికి వీల్లేదని అంటూ, చంద్రబాబు కొత్త కుట్రలను తెరపైకి తెస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లను పెట్టారు.

 

“ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం, బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు” అని ఎద్దేవా చేశారు.

 

అంతకు ముందు “అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు ‘తీసేసిన తాసిల్దార్లు’.” అని విమర్శలు గుప్పించారు.

 

ఇక చంద్రబాబునాయుడి గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ల కన్నా మేమే ఎక్కువగా కాపాడుకుంటాం. ఎందుకంటే, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు గారు ఉండాలి. ఆయన ఉంటేనే కదా, మేము గెలిచేది. రేపు అయినా, ఎల్లుండి అయినా, ఇంకోసారి అయినా.. నాలుగైదు టర్మ్స్ మేము గెలవాలంటే నారా చంద్రబాబునాయుడు గారు క్షేమంగా ఉండాలంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ సెటైర్లు వేశారు.

Leave a Reply