కోడెల కుటుంబం అక్రమాలపై మరోసారి విజయసాయిరెడ్డి కౌంటర్లు…

Share Icons:

 

హైదరాబాద్, 14 జూన్:

తన కుటుంబంపై కావాలనే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మొన్న మీడియా సమావేశంలో వివరించిన విషయం తెల్సిందే. తన కుటుంబ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అనసవరపు ఆరోపణలు సృష్టిస్తున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోడెల కుటుంబం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన….తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కోడెల కుమారుడు, కుమార్తె చిరు వ్యాపారులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని, కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించిన కోడెల శివప్రసాదరావుపై ఎబెట్ మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక కోడెల K ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోందని, త్వరలోనే వీరికి తగిన శిక్ష పడుతుందని అన్నారు.

 

Leave a Reply