రాహుల్‌ని చంద్రబాబు కోడలు కలవడం దేనికి నిదర్శనం?

YSRCP MP Vijayasaireddy fires on chandrababu, lokesh
Share Icons:

విశాఖపట్నం, 16 ఆగష్టు:

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా మొన్న కొందరు పారిశ్రామికవేత్తలతో హోటల్ తాజ్ కృష్ణాలో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి నారా చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా హాజరయ్యారు. ఇక ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పించారు.

రాహుల్ గాంధీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, కేసులు పెట్టించి దిగ్గజ నేత డాక్టర్ వైఎస్ఆర్ కుమారుడు జగన్‌ని గతంలో జైలుకు పంపారని గుర్తు చేశారు. అయితే నేడు ఆయన చంద్రబాబు కుమార్తెను కలిశారని, ఇది దేనికి నిదర్శనం? అని ప్రశ్నించారు. ఇక రాహుల్ గాంధీ నీచ రాజకీయాలు అట్టడుగు స్థాయికి దిగజారాయని, అవునా?” అని ట్వీట్ పెట్టారు. అలాగే చివరిలో #Pappu అనే హ్యాష్ ట్యాగ్‌ని కూడా పెట్టారు.

అదేవిధంగా మరో ట్వీట్‌లో….ఈ దేశంలో ఆగస్టు 15 సందర్భంగా తన ఇంటిపై జెండాను ఎగురవేసిన ఏకైక మంత్రి లోకేష్ నాయుడు మాత్రమేనని, ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొని వందనం సమర్పించారని, అధికారాన్ని దుర్వినియోగం చేయడమంటే ఇదే అని పేర్కొన్నారు.

మామాట: రాజకీయాలు వేరు..వ్యాపారం వేరు అనుకుంటా…..

Leave a Reply