చంద్రబాబు బినామీలంతా ఇప్పుడు రోడ్డున పడతారు….

vijayasai reddy comments on chandrababu and lokesh
Share Icons:

అమరావతి:

 

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతిలోని 30,000 ఎకరాల స్థలం చంద్రబాబు బినామీలు, బంధుగణం చేతిలోనే ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు ముందుగానే వారికి ప్లాన్ అందజేశారని కట్టబెట్టారని విమర్శించారు.

 

తాజాగా వీరంతా రోడ్డున పడతారని చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ‘అమరావతిని ఖూనీ చేశారు.. రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయి’ అంటూ ఆయన గింజుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

ఇక వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రులు ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబు చప్పట్లు కొట్టారని చెప్పారు. సభలో చంద్రబాబు నేర్పిన విద్యనే తాము ప్రదర్శిస్తున్నామని వ్యాఖ్యానించారు. నాటి వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెబితే.. ఖబర్దార్ అనే మాటలకు తాను క్షమాపణలు చెబుతానని స్పష్టం చేశారు.

 

తనకు సంబంధం లేని ఆడియో టేపులు తనవని టీడీపీ ఆరోపిస్తోందని శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనవి అని చెబుతున్న ఆడియో టేపులను, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో టేపులను ఫోరెన్సిక్ పరీక్షకు పంపేందుకు సిద్దమా? అని ప్రశ్నించారు. ఆ టేపులో మాట్లాడింది తానేనని తేలితే ఎలాంటి శిక్షనైనా అనుభవించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ విషయంలో శిక్ష అనుభవించడానికి చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

Leave a Reply