చంద్రబాబును దూరం పెడితే అన్నీ పరిష్కారమవుతాయి…

ysrcp mp vijayasai reddy comments on balakrishna son in laws
Share Icons:

అమరావతి: ఏపీ రాజధాని అంశంపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజధాని రైతులకు ఓ సలహా ఇచ్చారు. తుళ్లూరు రైతులు చంద్రబాబును నమ్మడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. తన బంధువర్గాల రియలెస్టేట్ వ్యాపారాల కోసం ఇప్పటికే ఒకసారి రైతులను చంద్రబాబు ఫణంగా పెట్టారని అన్నారు. ఇప్పుడు మళ్లీ వారినే అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని… చంద్రబాబును దూరం పెడితే అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు.

ఇదిలా ఉంటే మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా అమరావతిలోని 29 గ్రామాలు మండిపోతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏడవ రోజు ఆందోళనలను మొదలయ్యాయి. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి తమ నిరసనను తెలుపుతున్నారు. ఆరు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన రైతులు, ప్రజలకు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. తుళ్లూరులో రాజధాని రైతులు మహాధర్నాకు సిద్ధమయ్యారు.

కృష్ణాయపాలెం, వెలగపూడి, మందడంలో రైతులు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో రాజధాని రైతులు ఈరోజు సమావేశంకానున్నారు. గన్నవరం మండలం ఆతుకూరులో రాజధాని మార్పు అంశంపై వెంకయ్యనాయుడికి రాజధాని రైతుల వినతి పత్రం ఇవ్వనున్నారు.

అటు న్యాయవాదులు సైతం రాజధాని ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ఛలో హైకోర్టుకు న్యాయవాదులు పిలుపునిచ్చారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ కాకుమాడులో రైతులు ధర్నాకు దిగనున్నారు.

ఇక అమరావతిలో రైతుల ఆందోళనలు నేపథ్యంలో విశాఖలో కేబినెట్ నిర్వహించాలని సీఎం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కడప పర్యటనలో ఉండగా సీఎస్ సహాని కి జగన్ ఏర్పాట్ల విషయమై సూచనలు చేసినట్లు సమాచారం. కలెక్టర్ వినయ్ చంద్ కి చీఫ్ సెక్రెటరీ నీలం సహాని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ కౌన్సిల్ హాల్ లేదా, కలెక్టరేట్, లేక మరో వేదిక కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. వేదిక నిర్ధారణ కాగానే కేబినెట్ భేటీపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇవాళ లేదా రేపు దీనిపై ఓ అధికారిక ప్రకటన విడుదల కానుంది.

 

Leave a Reply