చంద్రబాబు ఆడంగి రాజకీయాలు మానుకోవాలి…

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రథ మహోత్సవానికి వెళ్లి వస్తుంటే తనపై దాడి జరిగిందని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. జై అమరావతి.. జై చంద్రబాబు అంటూ దాడి చేసి నోటికొచ్చినట్లుగా తిట్టారని ఆయన పేర్కొన్నారు. లేమళ్ల దగ్గర తనపై జేఏసీ ముసుగులో టీడీపీ మహిళ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని నందిగం సురేష్‌ పేర్కొన్నారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు తనపై దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.

ఇక రాజధానికి సంబంధం లేని వారే తనపై దాడి చేశారన్నారు. చంద్రబాబు ఆడంగి రాజకీయాలు మానుకోవాలన్నారు. ఆయనను ప్రజలు చెప్పుతో కొట్టినా సిగ్గు రాలేదన్నారు. చంద్రబాబు అవినీతి బయటపడుతోందని తమపై దాడులు చేస్తున్నారని నందిగం సురేష్ పేర్కొన్నారు. దళితులు అమరావతిలో తిరగడానికి అర్హులు కాదా? అని ప్రశ్నించారు. దళితులు ఎప్పుడు ఊరు బయట ఉండాలనుకొనే చరిత్ర చంద్రబాబుదన్నారు. అమరావతిలో ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితి నెలకొందన్నారు. అమెరికా నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఎంపీ నందిగం సురేష్‌ పేర్కొన్నారు.

అటు గన్‌మెన్లు, సిబ్బంది కళ్లల్లో మహిళలు కారం చల్లారు. అమరావతికి సంబంధం లేని వ్యక్తులు దాడులు చేస్తున్నారు. టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులే ఈ ఘటనకు పాల్పడ్డారు. కారం చల్లి నా గన్‌మెన్లు, సిబ్బందిపై దాడి చేశారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు అమరావతి ప్రజలు బలి అవుతున్నారు. చంద్రబాబుది రక్తం రుచి చూసిన చరిత్ర. దళితలు ఎప్పుడూ ఊరు బైట ఉండాలనుకొనే చరిత్ర ఆయనది. ఇప్పటికైనా చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియా వాస్తవాలు రాయాలి.

 

Leave a Reply