పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ మిథున్‌రెడ్డి

Share Icons:

కడప, 26 ఫిబ్రవరి:

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఆయన చెప్పినట్లుగా లక్షలకోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు ఎక్కడా కనిపించడంలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

అలాగే మరో సందర్భంలో ఆంధ్ర‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాము ఏప్రిల్‌ 6న లోక్ సభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని ఆయన తెలిపారు.

తమతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు.

ప్రత్యేక హోదాపై రోజుకోలా మాట్లాడుతోన్న చంద్రబాబు నాయుడి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతున్నార‌ని, ఈ తీరు స‌రికాద‌ని ఆయన విమ‌ర్శించారు.

మామాట: అందరూ చిత్తశుద్ధి నిరూపించుకుంటే మంచిదేమో…

English summary:

Rajampeta YSRCP MP Mithun Reddy demanded that the government release the white paper to the how many lakh crores has been invested in the state of Andhra Pradesh?

Leave a Reply