ఆరున వైసీపీ నేతల రాజీనామాలు..?

Krishna district YSRCP Candidate list in 2019 elections
Share Icons:

విజయవాడ, సెప్టెంబరు 04:

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఏపీ ప్రజలకి పెద్దగా తెలియడంలేదు. ఎప్పుడో శుక్రవారం కోర్ట్‌కు వస్తే తప్పితే, ఆయన గురించి ఎక్కడా పెద్దగా వార్తలు కూడా లేవు. ఇక చంద్రబాబుపై విమర్శలు చేసినా వర్క్ అవుట్ అవ్వకపోవటంతో, పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసి, ఒక రెండు రోజులు వార్తల్లో నిలిచారు.

అయితే, జగన్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలవటానికి, ప్రజల్లో చర్చ లేవనెత్తటానికి, మరో ఐడియాతో ముందుకు వస్తున్నారు. ఇందుకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే వేదిక కాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. గత ఏడాది కాలం నుండి ప్రధాన ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి విదితమే.

ఈ అంశంపై ఆ పార్టీ నిర్ణయంపై అనేక రకాల విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వాటికి పట్టించుకోలేదు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సెప్టెంబర్ 6న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు మొత్తం మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ప్రత్యేక హోదాతో లింక్ పెట్టి, రాజీనామా చెయ్యనున్నారు. ఎలాగూ అసెంబ్లీకి వెళ్ళినా ఉపయోగం లేదు కాబట్టి, ఇలా అయితే, ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అని జగన్ నమ్మకంగా తెలుస్తుంది. ఒక పక్క తెలుగుదేశం కేంద్రం పై పోరాడుతుంది అంటూ ప్రజల్లో అభిప్రాయం ఉండటంతో, తమ పోరాటాన్ని మరోమారు నిరూపించు కొనేందుకు వైకాపా ఈ రాజీనామాల అంశాన్ని ప్రయోగించనుంది. ఈ విధంగా, అయినా కొన్ని రోజులు వార్తల్లో ఉండవచ్చు అని, జగన్ ప్లాన్.

మామాట: మరి జగన్ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో?

 

Leave a Reply