బాలయ్య కార్యలయం నుంచే జగన్ కుటుంబంపై దుష్ప్రచారం….

Share Icons:

హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు ఖండించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. చంద్రబాబు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభతోనే, ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు చనిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనా చంద్రబాబు తీరు మారలేదని విమర్శలు చేశారు.

సోషల్ మీడియాలో టీడీపీ పెట్టిన అసభ్యకరమైన పోస్టింగ్స్ ను ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. హైదరాబాద్ లోని నందమూరి బాలకృష్ణ(ఎన్బీకే) కార్యాలయంలో రెండు వేల మంది పనిచేస్తూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పెట్టిన పోస్టింగ్స్ ను తాము నిరూపిస్తామని, ఈ విషయమై చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా ద్వారా మభ్యపెట్టే కార్యక్రమాలు చంద్రబాబు ఆపాలని, ఆయన అకృత్యాలు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో జగన్ కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్స్ ను ఖండిస్తున్నట్టు చెప్పారు.

యిడ్ ఆర్టిస్ట్ లతో మంత్రులను తిట్టించారని టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీని సంక్షోభంలోకి నెట్టారని, కేవలం నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది అని కొనియాడారు. జగన్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా టీడీపీకి విమర్శించడమే పని అని, అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Leave a Reply