తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ప్రజలు ఓడించారు…

ysrcp mla roja sensational comments on balayya and pawan
Share Icons:

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా? అని నిలదీశారు. ఏ అనుభవం ఉందని నారాయణ అధ్యక్షతన కమిటీ వేశారని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నో ప్రలోభాలు పెట్టినా.. తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ప్రజలు ఓడించారని రోజా పేర్కొన్నారు. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్‌రూమ్‌లేనా? అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకు.. చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు ఏనాడైనా జోలె పట్టారా? అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విపక్షనేతనా.. లేదంటే 29గ్రామాలకు మాత్రమే విపక్ష నేతనా? అంటూ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి నుంచి మహిళలను తీసుకొచ్చి నిరసనలు చేయిస్తున్నారని ఆరోపించారు. తల్లి తన బిడ్డలను సమానంగా చూసినట్లుగానే.. జగన్‌ మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.

అటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముష్టి ఎత్తుకుంటూ సీఎం వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ది కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన అని తెలిపారు. అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందన్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తారని చెప్పారు. గతంలో ఉన్న ఒప్పందాల మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు పిచ్చి కుక్కలా రోడ్డునపడి తిరుగుతున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు ఔట్‌ డేటేడ్‌ పొలిటీషియన్‌ అని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తోందని స్పష్టం చేశారు.

 

Leave a Reply