టీడీపీ నేతలు జైలుకి వెళ్ళేందుకు రెడీగా ఉండండి…

ysrcp mla roja comments on chandrababu
Share Icons:

తిరుపతి, 10 జనవరి:

టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై దాడి కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లిందని, త్వరలోనే ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుందన్నారు.

ఇక విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి చేయించి.. తప్పించుకోవడానికి టీడీపీ ప్రయత్నించిందని రోజా ఆరోపించారు. ఎన్ఐఏ నిజానిజాలు వెలుగులోకి తెచ్చిన తర్వాత టీడీపీ నేతలు ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఆమె అన్నారు. 

అలాగే 2014లో చేసిన తప్పును మళ్లీ చేయకూడదని ప్రజలు భావిస్తున్నారన్నారని, ఐదుసార్లు ఓడిపోయి మంత్రిపదవిలో ఉన్నందుకు సోమిరెడ్డి సిగ్గుపడాలని అన్నారు. అలాగే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నందుకు టీడీపీ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు.

మామాట: అంతే కదా…నిజనిజాలు తెలిస్తే అసలు దొంగలు బయటపడతారు…

Leave a Reply