అధికారం కోసం బాబు గాడిద కాళ్ళు కూడా పట్టుకుంటారు….

YSRCP MLA roja fires on cm chandrababu
Share Icons:

నగరి, 3 జనవరి:

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటారనీ, అవసరమైతే గాడిద కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. ముందు పార్టీలతో జతకట్టడం, ఆ తర్వాత వారిపైనే బురద చల్లడం చంద్రబాబు నైజమని అన్నారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ తో జతకట్టిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ తో అంటకాగుతున్నారని విమర్శించారు.

40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు, సొంతంగా వైసీపీని స్థాపించిన జగన్ కు తేడా కేవలం 5 లక్షల ఓట్లేనని తెలిపారు. చంద్రబాబుకు ఫైనాన్షియర్ గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు కూడా ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ-జనసేన బంధానికి ఇంతకు మించిన సాక్ష్యాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. 600 అబద్ధాల హామీలు ఇచ్చిన చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ మెజారితో గెలుస్తుందని అన్నారు.

మామాట: అంతే అంటారా..

Leave a Reply