అలా అయితే 80శాతం టీడీపీ వాళ్ళు జైల్లో ఉంటారు…

APIIC chairperson roja comments on chandrababu and lokesh
Share Icons:

తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజలు చైతన్యవంతులు కాబట్టే నారా లోకేశ్‌ను మంగళగిరిలో ఓడించారని ఆమె చెప్పారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేయడం సిగ్గుమాలిన చర్యని ఆమె అన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తున్నారని, ఏపీ సీఎం జగన్‌ మాత్రం ఏపీ అభివృద్ధికి కోసం పనిచేస్తున్నారని ఆమె అన్నారు.

లోకేశ్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న అసత్య ప్రచారంపై ఒకవేళ ఫిర్యాదు చేస్తే 80 శాతం మంది టీడీపీ నేతలు జైల్లో ఉంటారని చెప్పారు. 14 రోజుల్లోపు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయకపోయారని, దీంతో ఏపీ రాజధాని బిల్లు ఆమోదం పొందినట్లేనని తెలిపారు.

అటు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా ఆయన చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లాభం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

‘ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే… ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో… ఉస్కో అంటూ శివాలూగాడు. ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్ని కూలుస్తా, తేలుస్తా అని గాల్లో కత్తులు తిప్పాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు

Leave a Reply