దొంగల ముఠా కొత్త డ్రామా మొదలుపెట్టింది… ‘పల్నాడులో బందిపోట్లు పడ్డారు’

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి:

ఏపీ టీడీపీ నేతలు ఈరోజు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదని పోలీసులు ఎక్కడిక్కడ టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నేతలు టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలిందని ఆయన అన్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనే రచ్చ చేయడం ద్వారా… రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా దొంగల ముఠా కుట్రలు మొదలుపెట్టిందని మండిపడ్డారు.

అలాగే యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని, పల్నాడులో ప్రశాంతత నెలకొనడం చంద్రబాబుకు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు. పేదల జోలికి వస్తే ఊరుకోనని చంద్రబాబు చెబుతున్నారని… ఆయన దృష్టిలో కోడెల శివప్రసాద్, యరపతినేని, చింతమనేని ప్రభాకర్, నారాయణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, సుజనా చౌదరిలే నిరుపేదలని ఎద్దేవా చేశారు.

అలాగే నిద్రపట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చిత్తు చిత్తుగా ఓడి 100 రోజులే అయింది బాబు గారూ’ అంటూ విజయసాయి విమర్శించారు.

ఇక వైసీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి కూడా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతీసారి హింసను ప్రోత్సహించారని,  ఫ్యాక్షన్ తో గతంలో పల్నాడు అల్లాడిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ వచ్చాక గత ఐదేళ్లలో ‘పల్నాడులో బందిపోట్లు పడ్డారు’ అని స్థానికుల్లో ఎవరు అడిగినా చెబుతారన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పల్నాడు ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.

ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీ చేయడం, రూ.2,000 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు.. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం శాంతిని నెలకొల్పి అభివృద్ధి చేస్తుంటే తమ ఉనికికే ప్రమాదమని టీడీపీ నేతలు భయపడుతున్నారని మహేశ్ రెడ్డి తెలిపారు.

టీడీపీ హయాలో ఇసుక, మట్టి, నీరు, నకిలీ విత్తనాలు, లైంగిక దాడులు జరిగాయనీ, చివరికి అసెంబ్లీలో ప్లాస్టిక్ కుర్చీలను కూడా వదలని టీడీపీ నాయకులు తమను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని ఓ సామెత ఉందనీ, టీడీపీ నేతలు ఏపీలో ఆ ఫినాయిల్ ను కూడా వదలలేదని దుయ్యబట్టారు. గత 10 రోజుల నుంచి తాము పల్నాడులో బహిరంగ విచారణ చేపడతామని కోరుతూనే ఉన్నామని స్పష్టం చేశారు.

Leave a Reply