ఈసారి హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయం…

ysrcp leaders comments again balakrishna
Share Icons:

హిందూపురం, 25 ఆగష్టు:

టీడీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుండి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట అని అందరికీ తెల్సిందే. ఇక్కడ నుండి మాజీ సీఎం ఎన్టీఆర్, ఆయన కుమారుడు హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు. ఇక గత ఎన్నికల్లో ఎన్టీఆర్ మరో తనయుడు బాలకృష్ణ అఖండ విజయం సాధించారు.

తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన ఖచ్చితంగా గెలవరని కొందరు వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… టీడీపీ నేతలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లాలో సర్వే చేయిస్తున్నారు. దీనిలో భాగంగానే హిందూపురంలోనూ సర్వే చేపట్టారు. అయితే.. సర్వే వారికి అనుకూలంగా వచ్చేందుకు వైసీపీ నేతలను సైతం టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

కావాలనే టీడీపీకి మద్దతుగా సర్వే చేస్తున్నారని ఆరోపిస్తూ 15మంది యువకులను వైసీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైసీపీ నేతలను ప్రలోభపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ నేత నవీన్‌ నిశ్చల్‌ ఆరోపించారు. సర్వే పేరుతో వైసీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమని, అందుకే టీడీపీ నేతలు భయపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మామాట: మరి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి..

Leave a Reply