త్వరలో టీడీపీ ప్రభుత్వానికి మరణం తప్పదు: వైసీపీ

YSRCP leader tammineni seetaram criticized tdp government
Share Icons:

విజయవాడ, 8 జూన్:

ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఐసీయూలో ఉందని, త్వరలోనే ప్రభుత్వానికి మరణం తప్పదని వైసీపీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం అన్నారు. సీతారాం, జోగి రమేశ్, వెల్లంపల్లి, మల్లాది విష్ణు ఇతర వైసీపీ నేతలు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నాలుగేళ్ళ టీడీపీ పాలనపై చార్జీషీట్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలి సంతకం పెట్టిన రైతు రుణమాఫీలో కూడ అనేక ఆంక్షలు పెట్టడం వల్ల రూ.87 వేల కోట్ల రుణమాఫీ కేవలం రూ.24 వేల కోట్లకే ప్రభుత్వం కుదించిందని విమర్శించారు. అలాగే డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హమీని కూడా అమలు చేయలేదన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు వస్తోందని ఇచ్చిన హమీ గాలిలో కలిసిపోయిందన్నారు. ఇక నిరుద్యోగ భృతి అయితే అడ్రెస్ లేదని, 1.45 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హమీ కూడ అమలుకు నోచుకోలేదన్నారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నత్తనడకన  సాగిస్తున్నారని, కేంద్రం నుండి తమ చేతుల్లోకి తీసుకొని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదని విమర్శలు గుప్పించారు.

బాబు ఒక రాజకీయ వ్యభిచారని, తమ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్నారని వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినా కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

మామాట: ప్రభుత్వ పాలన ప్రతిపక్ష పార్టీలకు నచ్చడం కష్టమేగా..!

Leave a Reply