అలా అయితే ఏపీలో టీడీపీ భూస్థాపితం అవ్వడం ఖాయం…

YSRCP leader peddireddi comments on tdp and congress align
Share Icons:

విజయవాడ, 8 సెప్టెంబర్:

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఆత్మగౌరవ నినాదంతో దివంగత నేత ఎన్టీఆర్ తెలగుదేశం పార్టీని స్థాపించారరని, అలాంటి పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు.

ఈరోజు ఆయన విజయవాడ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ తో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, కాంగ్రెస్ తో పొత్తు వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదని ఎద్దేవా చేశారు.

ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చచ్చిపోయిందని, ఆ పార్టీ నేతలంతా కొందరు వైసీపీలోకి, మరికొందరు టీడీపీలోకి మారిపోయారని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసంభవమని, అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. బీజేపీ కానీ, మరో ఫ్రంట్ కానీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ అధినేత జగన్ పోరాడి, ప్రత్యేక హోదాను సాధిస్తారని తెలిపారు.

మామాట: మరి ఈ పోత్తు ఏపీలో కూడా కొనసాగుతుందో లేదో?

Leave a Reply