పవన్‌కు బహిరంగ లేఖ రాసిన వైసీపీ నేత…

Pawan kalyan ap bifurcation
Share Icons:

కాకినాడ, 22 అక్టోబర్:

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఓ బహిరంగ లేఖ రాశారు. తనపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.  

జనసేన కవాతు సందర్భంగా ఇటీవల ధవళేశ్వరంలో జరిగిన సభలో పవన్ తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తాను కొనుగోలు చేసిన స్థలం విషయంలో వాస్తవాలేమిటో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను అడిగితే తెలుస్తుందని ఆయన అన్నారు.

2014 ఎన్నికల సమయంలో కూడా పవన్ ఇవే ఆరోపణలు తనపై చేశారని గుర్తుచేశారు. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా తనపై విమర్శలు చేయడం పవన్‌కు తగదని ఆయన అన్నారు. నాయకుడు అనేవాడు వాస్తవాలు తెలుసుకొని పూర్తి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తరువాతే మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. ఇక గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్  ప్రచారం చేసి గెలిపించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అవినీతిపై ప్రజాపోరాట యాత్రలో పవన్ మాట్లాడాలని సూచించారు.

మామాట: మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో….

Leave a Reply