మంత్రివర్గ ఏర్పాటుపై అసంతృప్తి ఉంది: మేకపాటి

Share Icons:

నెల్లూరు, 11 జూన్:

జూన్ 8న 25మంది కొత్త మంత్రులతో ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అయితే చాలామంది వైసీపీ నేతలు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

కాకపోతే రెండున్నరేళ్ల తర్వాత కచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పడంతో వారికి కొంత ఊరట కలిగించే అంశం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పందించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రివర్గ ఏర్పాటుపై కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు పరిస్తితి ఇలాగే ఉంటుందని,  అందరిని సంతృప్తి పర్చడం సాధ్యం కాదన్నారు.

అయితే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన మంత్రివర్గ కూర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పేరుగాంచిన మేకపాటి కుటుంబం నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డిని జగన్ తన కేబినెట్‌లో తీసుకొని.. ఐటీశాఖ కట్టబెట్టిన విషయం విదితమే.

Leave a Reply