అప్పుడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించావ్…ఇప్పుడు నీపైనే చెప్పులు పడుతున్నాయి…

ysrcp leader lakshmi parvathi comments on chandrababu
Share Icons:

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. విశాఖపై ఎల్లోమీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయించారని ధ్వజమెత్తారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను చంద్రబాబు అడ్డుకున్నారని.. అందుకే విశాఖ ప్రజలు ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు అవినీతి పరుడు, స్వార్థపరుడని.. సొంత మామకే వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలే చంద్రబాబుపై చెప్పులు వేస్తున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.

చంద్రబాబు స్క్రిప్టునే కాంగ్రెస్ నేతలు చదువుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎంపీ నందిగం సురేష్‌పై దాడి చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబేనని.. అమరావతి రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమానికి  సీఎం జగన్‌ అనేక పథకాలు తీసుకొచ్చారని చెప్పారు.

ఇక గత సంవత్సరం ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేసేందుకు విశాఖపట్నంకు వచ్చిన వైఎస్ జగన్ ను ఎయిర్ పోర్టు నుంచి ఏ చట్టం కింద తిప్పి పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని, ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?” అని అన్నారు.

 

Leave a Reply