టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకి ముందే తెలుసు…

Share Icons:

తిరుపతి, 22 మే:

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బుధవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన …ఉనికి కోసం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెప్తున్నాయని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపోతే మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. లగడపాటి సర్వే చేయకుండా అబద్దాలు చెప్పారని అవన్నీ ఫేక్ అంటూ విమర్శించారు.

మామాట: అంతే అంటారు…

Leave a Reply