చంద్రబాబు…రాష్ట్ర పరువుని జాతీయ స్థాయిలో తీస్తున్నారు…

Share Icons:

అమరావతి, 21 మే:

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సి రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…అసలు జాతీయ స్థాయిలో ఏ నేతా పిలవకున్నా, పనిగట్టుకుని వెళుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.

ఎగ్జిట్ పోల్స్ తనకు ప్రతికూలంగా రావడంతో తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, తన ఓటమిని ఈవీఎంలపై నెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు. 50 శాతం వీవీప్యాట్స్ స్లిప్స్‌ని లెక్కించడం కుదరదని చెప్పిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం సిగ్గు చేటని అన్నారు.

ఇక రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని విమర్శలు, గడచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

అయితే చంద్రబాబు దేశమంతా తిరిగినా ప్రయోజనం కలగబోదని, ఆయన హుందాతనాన్ని ఏనాడో కోల్పోయారని, అందుకే విపక్షాల సమావేశానికి చంద్రబాబును పక్కకు పెట్టారని ఎద్దేవా చేశారు.

కాగా, వీవీప్యాట్లలోని అన్ని స్లిప్ లనూ లెక్కించి, ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిచూడాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. వీవీప్యాట్ లెక్కింపుపై గతంలో తామిచ్చిన ఆదేశాలే అమలవుతాయని, 100 శాతం స్లిప్ లను లెక్కించాలన్న పిటిషన్ ను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది.

‘టెక్నోపర్‌ ఆప్‌’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం, ఈ పిటిషన్ లో ఎలాంటి మెరిట్‌ లేదని అభిప్రాయపడింది. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

మామాట: అంతే అంటారా…

Leave a Reply