ఆధారాలు దొరికాయట…చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమట

tdp mla's not attend the chandrababu fasting....who will hand to tdp
Share Icons:

కడప: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బస్సు యాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు రామచంద్రయ్య. నిజాయితీగా లేదనే గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని.. అయినా చంద్రబాబు తీరు మారలేదన్నారు. ఎన్నికలకు ముందు మోదీపై విమర్శలు చేసి.. ఇప్పుడు బీజేపీతో జతకట్టేందుకు తహతహలాడుతున్నారని సెటైర్లు పేల్చారు. దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఎన్నో సమస్యలు వచ్చినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీపై విమర్శలు చేయకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

బాబు ఐదేళ్ల పాలనలో రూ.వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని.. ఆ అవినీతి సొమ్మంతా గడిచిన ఎన్నికల్లో రాష్ట్రాలకు బదలాయించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారని.. నిజాలన్నీ బట్టబయలై జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలని కోరారు. జగన్ ఢిల్లీ పర్యటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. సీఎం రాష్ట్ర సమస్యలు, రావాల్సిన నిధులపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారని.. ప్రధాని జగన్‌ను మందలించారని చెప్పడం విడ్డూరంగా ఉ:దన్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తంగా మారాయని ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. సీఎం జగన్‌ విద్యాభివృద్ధికి నడుం బిగించారని, ఆయన విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఇంగ్లిషు మీడియం దోహదపడుతుందని తెలిపారు.

 

Leave a Reply