వైసీపీ నుండి జనసేనలోకి జంప్ కొట్టనున్న మరో నేత…

ysrcp leader balakrishna is ready to joins janasena
Share Icons:

కాకినాడ, 21 ఆగష్టు:

ఎన్నికలు సమయం సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సొంత పార్టీ మీద అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు వేరే పార్టీలోకి  జంప్ కొట్టడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయా పార్టీ నేతలు వేరే పార్టీ కండువా కప్పుకున్నారు.

ఇక ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకి చెందిన డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ జనసేనకు జై కొట్టారు. తాజాగా అదే వైసీపీకి చెందిన మరోబలమైన నేత పితాని బాలకృష్ణ జనసేనలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు.

ముమ్మడివరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే పితాని బాలకృష్ణ పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా బాలకృష్ణ పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక  పార్టీ అధ్యక్షుడు జగన్ ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్  కుమార్ పోటీ చేస్తారని స్పష్టం చేశారని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు నియోజకవర్గంలో వైసీపీ బాధ్యతలను నిర్వహిస్తున్న బాలకృష్ణ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చడంతో త్వరలో పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పితాని బాలకృష్ణ రాకను పవన్ కళ్యాణ్ స్వాగతించినట్లు తెలిపారు.

మామాట: క్షణ క్షణానికి మారుతున్న ఏపీ రాజకీయం….

Leave a Reply