కావాలనే నేను పార్టీ మారుతున్నని ప్రచారం చేస్తున్నారు: వైసీపీ నేత

ysrcp leader baireddy siddarth reddy sensational comments
Share Icons:

కర్నూలు:

వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనను ఏకాకిని చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.  అయితే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌తో ఎలాంటి విబేధాలు లేవని,  నియోజకవర్గంలో పార్టీకి సంబంధం లేని వ్యక్తుల పెత్తనం కొనసాగుతోందన్నారు.

నియోజకవర్గంలో తన పెత్తనం జరుగుతుందంటూ కొందరు నాయకులు అసత్యప్రచారాలు చేస్తూ పత్రికల్లో రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు టీడీపీ నాయకులు ఇప్పటికీ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారని, నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఎలా పెత్తనం చెలాయిస్తున్నారో, వారి కుట్రలను సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి వివరించానని అన్నారు.

అలాగే కావాలని తాను పార్టీ మారుతున్నానని పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం తనపై కుట్రలో భాగమేనన్నారు. పార్టీ కోసం సమష్టిగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామన్నారు.

Leave a Reply