జగన్ నామినేషన్ ఎప్పుడంటే..!

Share Icons:

హైదరాబాద్, మార్చి 13,

ఏప్రిల్ 11న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
2014 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచిన జగన్ తాజా ఎన్నికల్లో కూడా అక్కడనుంచే పోటీచేస్తున్నారు. అయితే ఈ నెల 18 వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. దీనితో జగన్ మార్చి 22న నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా ఉన్న జగన్ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల పూర్తి జాబితా వెల్లడించిన తర్వాత సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టనున్నట్టు పావివిధర్టీవర్గాలు తెలిపాయి.

వైసీపీలోకి పాలక టీడీపీ సహా వివిధ పార్టీల నేతలు, వాణిజ్య, సినిమా రంగాల ప్రముఖులు వెల్లువలా వస్తుండడంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల కన్వీనర్లుగా ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే క్యాడర్ పరిస్థితి ఏంటన్నది జగన్ ను డైలమాలో పడేస్తోంది.

అందుకే తొలి విడతగా 75 మంది పేర్లు వెల్లడించి, ఆపై పరిస్థితులను బట్టి రోజుకు 25 మంది చొప్పున పేర్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. మొత్తం అభ్యర్థుల పేర్లన్నీ వెల్లడయ్యాక జగన్ ప్రచారబరిలో దిగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. అందుకే బస్సు యాత్ర రద్దుచేసుకున్న జగన్ హెలికాఫ్టర్ ద్వారా రాష్ట్రపర్యటనకు వెళ్లనున్నారు.

మామాట: గెలుపు తెలిసిందేగా… మంచి రోజు.. అభిమానులకోసం.. అంతే

Leave a Reply