సిఎం గారూ….. టీడీపీని బీజేపీలో విలీనం చేయండి : కొడాలి నాని

Share Icons:

విజయవాడ, 22 ఫిబ్రవరి:

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం చంద్రబాబుపైన మరోసారి విమర్శలు గుప్పించారు.

కేంద్రం ప్రభుత్వం నుంచి ఏపీకి నిధులు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని, తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తే నిధులొస్తాయంటూ ఆయన ఎద్దేవా చేశారు.

బుధవారం ప్రత్యేకహోదాపై విజయవాడలో జరుగుతున్న చర్చా వేదికలో పాల్గొన్న కొడాలి నాని రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, టీడీపే పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఓటుకునోటు కేసులో దొరికిపోయిన తరువాత కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగ తయారైపోయాడని ఆరోపించారు.

ఇప్పటివరకు ఏపీకి కేంద్రం ఏ విధంగానూ సాయం చేయకపోతే ఇంతకాలం కేంద్రానికి చంద్రబాబు ఎందుకు భజన చేశారో చెప్పాలని, ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసిపి అధ్యక్షుడు జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నాడని, గడచిన మూడేళ్లుగా ప్రత్యేకహోదా కోసం నిలకడగా పోరాటం చేస్తోంది వైసీపీ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తానడం, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతానంటూ జగన్ చేసిన ప్రకటనలు విన్న తర్వాత చంద్రబాబుకు దిక్కుతోచడం లేదని నాని విమర్శించారు.

మామాట: ఎవరి భజన వాళ్ళది….

English summary:

YSRCP Gudivada MLA Kodali Nani sensational comments  against CM Chandra Babu. He said that the AP has the only way to get funds from central government is  the TDP would merge into the BJP.

Leave a Reply